: బ్రస్సెల్స్ లో ముమ్మర సోదాలు... ఆరుగురు అనుమానితుల అరెస్ట్
బెల్జియం రాజధాని బ్రస్సెల్స్ ఎయిర్ పోర్టుపై ఉగ్రవాదుల దాడితో ఆ నగరంలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. దాడి జరిగిన వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు నగరాన్ని జల్లెడ పడుతున్నారు. రెండు రోజులుగా కొనసాగుతున్న దాడుల్లో ఇప్పటిదాకా ఆరుగురు అనుమానితులను పోలీసులు అరెస్ట్ చేశారు. నిఘా వైఫల్యం కారణంగానే దాడులు జరిగాయని బెల్జియం మంత్రులు ఆగ్రహం వ్యక్తం చేయడంతో పోలీసులు సోదాలను ముమ్మరం చేశారు. పట్టుబడ్డ అనుమానితుల్లో ఓ వ్యక్తి వద్ద నుంచి పోలీసులు భారీ ఎత్తున ఆయుధాలు, మందుగుండు సామగ్రి స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. మిగిలిన అనుమానితులు కూడా ఉగ్రవాదులేనన్న కోణంలో పలు కీలక ఆధారాలను పోలీసులు సేకరించినట్లు తెలుస్తోంది.