: సాగునీటి ప్రాజెక్టులపై చంద్రబాబు సమీక్ష... డెడ్ లైన్లు నిర్దేశించిన వైనం
సాగునీటి ప్రాజెక్టులపై ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు నిన్న సమీక్ష చేపట్టారు. జలవనరుల శాఖ ఉన్నతాధికారులు హాజరైన ఈ సమీక్షలో ఆయా ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు కచ్చితమైన టైం బౌండ్ తో ముందుకెళ్లాలని చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. జాతీయ ప్రాజెక్టు హోదా దక్కిన పోలవరం ప్రాజెక్టును సకాలంలో పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టాలని ఆయన ఆదేశాలు జారీ చేశారు. ఇందుకోసం జాతీయ ఉపాధి హామీ పథకం నిధులను కూడా వెచ్చించాలని సూచించారు. ఇక పట్టిసీమ ప్రాజెక్టులో మిగిలిన అన్ని పనులను మే నెలాఖరులోగా పూర్తి చేయాలన్నారు. గాలేరు-నగరి ప్రాజెక్టును ఆగస్టు చివరి నాటికి పూర్తి చేయడంతో పాటు వచ్చే ఖరీఫ్ లోనే ఆ ప్రాజెక్టు పరిధిలోని ఆయకట్టుకు నీరివ్వాలని సూచించారు. నాగావళి, వంశధార నదుల అనుసంధానానికి అత్యధిక ప్రాధాన్యమిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.