: అనువాదకుడు వద్దు...మనసులోని భావాన్ని అర్థం చేసుకునేందుకు భాషతో పని లేదు!: కన్నయ్య కుమార్
విజయవాడలోని ఐవీ ప్యాలెస్ లో వామపక్షాలు నిర్వహించిన సభలో జేఎన్యూ స్టూడెంట్ లీడర్ కన్నయ్య కుమార్ మాట్లాడుతుండగా, ఆయన మాటలను అనువదించడానికి ఓ వ్యక్తి ముందుకువచ్చారు. ఈ సందర్భంగా కన్నయ్య చెబుతూ, తనకు దేశంలోని అన్ని భాషలు వచ్చి ఉంటే ఎంత బాగుండేదో కదా? అన్నారు. అయితే తనకు కేవలం హిందీ, ఇంగ్లిష్ మాత్రమే వచ్చని, చెబుతూ హిందీలో మాట్లాడారు. తానింతవరకు ఏం మాట్లాడానో అంతా తన మనసులోని మాటలే మాట్లాడానని, తనకు ట్రాన్స్ లేటర్ అవసరం లేదని...తన మనసులోని సంఘర్షణను అర్థం చేసుకునేందుకు భాషతో పని లేదని, తాను పలికే భాషలో భావం అర్థం చేసుకోగలిగితే చాలని పేర్కొన్నారు. తన మాటల్లోని కఠిన పదాలు ఉండవని, అలా ఏవైనా పదాలు ఉంటే వాటిని ట్రాన్స్ లేట్ చేస్తారని, సాధారణ పదాలన్నీ అర్థం చేసుకోవాలని ఆయన సూచించారు. కార్యకర్తలు తన భావాన్ని అర్థం చేసుకోగలరని కన్నయ్య విశ్వాసం వ్యక్తం చేశారు.