: గన్నవరం ఎయిర్ పోర్ట్ కు చేరుకున్న కన్నయ్య
జేఎన్యూ విద్యార్థి సంఘం నేత కన్నయ్య కుమార్ కాసేపటి క్రితం కృష్ణా జిల్లాలోని గన్నవరం ఎయిర్ పోర్ట్ కు చేరుకున్నాడు. కన్నయ్యతోపాటు సీపీఐ నారాయణ కూడా ఉన్నారు. విజయవాడలోని ఐవీ ప్యాలెస్ దగ్గర జరగనున్న బహిరంగ సభలో కన్నయ్య ప్రసంగించనున్నాడు. ఈ సందర్భంగా వామపక్ష కార్యకర్తలు, ఏఐఎస్ఎఫ్ విద్యార్థి సంఘాల నేతలు భారీగా అక్కడికి చేరుకున్నారు. కన్నయ్యకు రక్షణగా సభా వేదిక వద్ద కర్రలతో కార్యకర్తలు నిలబడ్డారు. కాగా, ఐవీ ప్యాలెస్ సభావేదిక దగ్గర బీజేవైఎం రాష్ట్ర ఉపాధ్యక్షుడు చిక్కాల రజనీకాంత్ సహా మరో ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు.