: రియల్ ధోనీని కలసిన ‘రీల్’ ధోని!


టీమిండియా కెప్టెన్ ధోని జీవితంపై వంద సినిమాలు తీసినా సరిపోవని, అత్యుత్తమ క్రీడాకారుల్లో ధోనీ ఒకరని, ఆయనంటే తనకెంతో ఇష్టమని ‘ధోని’ సినిమాలో హీరోగా నటించిన సుశాంత్ సింగ్ రాజ్ పుట్ ప్రశంసల వర్షం కురిపించాడు. ఈ మేరకు సుశాంత్ ఒక ట్వీట్ చేశాడు. కెప్టెన్ ధోనీని కలిసిన ఒక ఫొటోను కూడా ఆయన పోస్టు చేశాడు. టీ20 వరల్డ్ కప్ లో బంగ్లా దేశ్ పై భారత్ విజయం సాధించిన సందర్భంగా టీమిండియాకు సుశాంత్ కంగ్రాట్స్ తెలిపాడు. కాగా, ధోనీ జీవితం ఆధారంగా తెరకెక్కిన చిత్రాన్ని వచ్చే సెప్టెంబర్ 2న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

  • Loading...

More Telugu News