: కాసేపట్లో పీడీపీ సమావేశం.. జమ్మూ కాశ్మీర్ మొట్టమొదటి మహిళా సీఎంగా మెహబూబా?
పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీ (పీడీపీ) అధినేత్రి మెహబూబా ముఫ్తీ జమ్మూ కాశ్మీర్ మొట్టమొదటి మహిళా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరికాసేపట్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అంశంపై ఆమె పీడీపీ ఎమ్మెల్యేలతో సమావేశం నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా తన తండ్రి ముప్తీ మహమ్మద్ సయీద్ సమాధిని ఆమె సందర్శించి ప్రార్థనలు చేశారు. ఇక ప్రభుత్వ ఏర్పాటుపై తుది నిర్ణయం వెల్లడికానుందని రాజకీయవర్గాలు భావిస్తున్నాయి. మెహబూబా ముఫ్తీ నివాసంలో మరికాసేపట్లో పార్టీ సమావేశం ప్రారంభం కానుంది. ఇటీవలే ప్రధాని మోదీతో భేటీ అయిన మెహబూబా.. తమ భేటీ వివరాలను ఈ సమావేశంలో వివరించనున్నారు. బీజేపీ-పీడీపీల మధ్య ప్రభుత్వ ఏర్పాటు విషయంలో స్పష్టమైన అవగాహన కొరవడడంతో కొన్ని నెలలుగా అక్కడ రాష్ట్రపతి పాలన కొనసాగుతున్న సంగతి తెలిసిందే.