: టీవీ లైవ్ షోకు స్పందన... జాహ్నవికి రూ. 25 వేలు సాయం చేసిన మంచు లక్ష్మి


చిన్న వయసులోనే పలు పర్వతాలను అధిరోహించిన జాహ్నవికి రూ. 25 వేల ఆర్థిక సాయం చేస్తున్నట్టు సినీ నటి, నిర్మాత మంచు లక్ష్మి వెల్లడించారు. తనకు మరిన్ని పర్వతాలు ఎక్కాలని ఉందని, ఆర్థిక సహాయం కావాలని ఓ టీవీ చానల్ లైవ్ షోలో జాహ్నవి కోరుతున్న సమయంలో మంచు లక్ష్మి స్పందించారు. ఆమెకు సాయాన్ని ప్రకటించడంతో పాటు, తాను నిర్వహిస్తున్న 'మేము సైతం' కార్యక్రమానికి సెలబ్రిటీగా ఆహ్వానిస్తానని తెలిపారు. ఎన్ని అవాంతరాలు ఎదురైనా అనుకున్నది సాధించాలని సలహా ఇచ్చారు. కాగా, తనకు సాయం చేసిన లక్ష్మికి ఈ సందర్భంగా జాహ్నవి కృతజ్ఞతలు తెలిపారు.

  • Loading...

More Telugu News