: జపాన్ లో మహేశ్ బాబు బావ బర్త్ డే... తరలివెళ్లిన 60 మంది ప్రముఖులు!
ప్రిన్స్ మహేశ్ బాబు బావ, గుంటూరు పార్లమెంట్ సభ్యుడు గల్లా జయదేవ్, పుట్టిన రోజు వేడుకలు జపాన్ రాజధాని టోక్యోలో వైభవంగా జరగనున్నాయి. తన కుటుంబంతోపాటు దగ్గరి సన్నిహితులు ఆయన ఆహ్వానం మేరకు జపాన్ బయలుదేరి వెళ్లినట్టు తెలుస్తోంది. జయదేవ్ పుట్టిన రోజు వేడుకల కోసం మొత్తం 60 మంది వరకూ జపాన్ వెళ్లినట్టు తెలుస్తుండగా, వారిలో రానా దగ్గుబాటి, సుధీర్ బాబు తదితరులు ఉన్నారని సమాచారం. ఇదే సమయంలో 'బ్రహ్మోత్సవం' షూటింగ్ లో బిజీగా ఉండటంతో మహేశ్ బాబు మాత్రం వెళ్లలేకపోయారని తెలిసింది.