: కాంగ్రెస్ ను ఎందుకు వీడానంటే..: సాయిప్రతాప్


రాష్ట్రాభివృద్ధికి, ముఖ్యంగా రాయలసీమ అభివృద్ధికి అనునిత్యం పాటుపడుతున్న చంద్రబాబునాయుడికి అండదండగా నిలవాలన్న ఉద్దేశంతోనే ఆ పార్టీలో చేరినట్టు కడప జిల్లా రాజంపేట మాజీ ఎంపీ సాయిప్రతాప్ వ్యాఖ్యానించారు. ఈ ఉదయం ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడి సమక్షంలో కాంగ్రెస్ పార్టీని వీడి తెలుగుదేశంలో చేరిన సాయిప్రతాప్ మీడియాతో మాట్లాడారు. నియోజకవర్గంలో అందరమూ చర్చించుకున్న తరువాతే ఈ నిర్ణయం తీసుకున్నానని స్పష్టం చేశారు. "ఈనాడు చాలా మందికి ఒక రకమైన ఆలోచన వచ్చి వుండవచ్చు. మరి... కాంగ్రెస్ పార్టీని వదిలిపెట్టి తెలుగుదేశం పార్టీలో ఆయన చేరారు అని. నిజమే, మీరు ప్రశ్న అడగక ముందే సమాధానం ఇస్తున్నాను. ఇప్పుడున్న పరిస్థితుల్లో అందరూ చేయి కలిపితేనే... ఇప్పుడున్న ముఖ్యమంత్రితో కలిసి పనిచేసి ముందుకు వెళ్లాలన్న ఆకాంక్ష... రెండవది రాష్ట్రంలోని ప్రాంతాలన్నీ బాగుండాలన్న ఉద్దేశం... అందుకే నేను ఈ నిర్ణయం తీసుకుని కళా వెంకట్రావు ఆహ్వానంతో వచ్చాను. పెద్దల ఆశీర్వాదంతో ముందుకు వెళ్తానని తెలియజేసుకుంటున్నాను. నమస్కారం" అన్నారు.

  • Loading...

More Telugu News