: ఎట్టకేలకు దొరికింది.. పఠాన్‌కోట్‌లో అపహరణకు గురైన కారు లభ్యం
పంజాబ్‌లోని పఠాన్‌కోట్‌లో ఇటీవల అపహరణకు గురైన కారు లభ్యమైంది. ఈనెల 22న గుర్తు తెలియని దుండగులు పఠాన్‌కోట్‌లో ఓ కారును అపహరించిన సంగతి తెలిసిందే. గురుదాస్‌పూర్‌లోని పశ్యాల్ గ్రామంలో దుండగులు ఆ కారును వదిలివెళ్లారు. ముగ్గురు దుండగులు తుపాకులతో ఓ వ్యక్తిని బెదిరించి కారును అపహరించిన ఘటన రెండు రోజుల క్రితం కలకలం రేపింది. అయితే, కారును అపహరించిన దుండగులు పరారీలోనే ఉన్నారు. వారి ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తున్నారు.