: బాబు సర్కారుకు అల్టిమేటం... రేపటి నుంచి ఎన్టీఆర్ ఆరోగ్య సేవలు బంద్!
రేపటి నుంచి ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ పేరిట కార్పొరేట్ ఆసుపత్రులు చేస్తున్న వైద్య సేవలు నిలిచిపోనున్నాయి. ఈ మేరకు స్పెషాల్టీ ఆసుపత్రుల యాజమాన్య సంఘం చంద్రబాబు ప్రభుత్వానికి నోటీసులు పంపింది. తమకు ఇప్పటికే రూ. 350 కోట్లకు పైగా బకాయిలు చెల్లించాల్సి వుందని, వాటిని ఇచ్చేదాకా వైద్య సేవలను అందించలేమని స్పష్టం చేసింది. ఈ మేరకు ఎన్టీఆర్ ఆరోగ్య సేవ సీఈఓకు నోటీసులు పంపిన ఆసుపత్రుల యాజమాన్యం, 150కి పైగా హాస్పిటల్స్ లో సేవలు ఆగిపోతాయని హెచ్చరించింది.