: బాల్ ఠాక్రేను హత్య చేయాలని లష్కరే తోయిబా సూచించింది: హెడ్లీ సంచలన వాంగ్మూలం
శివసేన అధినేత బాల్ ఠాక్రేను హత్య చేయాలని ప్లాన్ వేసినట్టు ముంబై బాంబు పేలుళ్ల నిందితుడు డేవిడ్ హెడ్లీ సంచలన విషయాన్ని వెల్లడించాడు. అమెరికాలోని గుర్తు తెలియని ప్రాంతంలో ఉన్న పాక్-అమెరికన్ ఉగ్రవాది హెడ్లీని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ముంబై కోర్టు విచారిస్తున్న సంగతి తెలిసిందే. హెడ్లీ మలి విచారణ రెండో రోజు సాగుతుండగా, బాల్ ఠాక్రేను హతమార్చాలని లష్కరే తోయిబా తమకు సూచించినట్టు వెల్లడించాడు. ఆయన్ను లక్ష్యంగా చేసుకోవడం ద్వారా ముంబైలో మత కల్లోలాలు సృష్టించవచ్చన్నది వారి భావనని పేర్కొన్నాడు. హెడ్లీ విచారణ కొనసాగుతోంది.