: బ్రస్సెల్స్ మానవబాంబు చివరి సందేశమిదే!


"సలాహ్ అబ్దెస్లామ్ వలే నేను జైల్లో ఉండాలని అనుకోవడం లేదు. ప్రతిచోటా పోలీసులు సోదాలు చేస్తున్నారు. ఇంక ఏ మాత్రం భద్రత లేదు. ఏం చేయాలో తోచడం లేదు. ఇక ఏదో ఒకటి చేయాల్సిందే"... బెల్జియం రాజధాని బ్రస్సెల్స్ విమానాశ్రయంపై ఉగ్రదాడి జరిపిన సోదరుల్లో ఒకడైన ఇబ్రహీం బక్రోయి చివరి మెసేజ్ ఇది. ఎయిర్ పోర్టు సమీపం నుంచి పేలని బాంబును, ఓ ల్యాప్ టాప్ నుంచి సేకరించిన సమాచారంతో ఉగ్రవాదులు ఆశ్రయం పొందిన ఇంట్లో తనిఖీలు చేయగా, అక్కడ ఓ కాగితంపై రాసి వున్న ఈ మెసేజ్ పోలీసులకు లభ్యమైంది. కాగా, దాడులు జరిపిన సోదరులు పోలీసులు అరెస్ట్ చేసిన సలాహ్ అబ్దెస్లామ్ సన్నిహితులని మీడియాలో కథనాలు వచ్చాయి. వీరితో పాటు ఎయిర్ పోర్టు సీసీటీవీ కెమెరాల్లో కనిపించి మాయమైన మూడవ వ్యక్తి మోస్ట్ వాంటెడ్ బాంబ్ మేకర్ నిజ్జమ్ లాచ్రోయ్ అని పోలీసులు గుర్తించారు. బాంబులను చేరవేసిన తరువాత ఇతను మాయమై ఉండవచ్చని తెలుస్తోంది. వీరున్న ఇంట్లో 15 కిలోల పేలుడు పదార్థాలతో పాటు 150 లీటర్ల ఎసిటోన్, 30 లీటర్ల ద్రవ ఆక్సిజన్, సూట్ కేస్ నిండా మేకులు, డిటోనేటర్లు లభ్యమయ్యాయి.

  • Loading...

More Telugu News