: పేలుళ్లకు ముందు బ్రస్సెల్స్ ఎయిర్ పోర్టులోకి ఇన్ఫోసిస్ ఉద్యోగి... ఆ తర్వాత అడ్రెస్ గల్లంతు
బెల్జియం రాజధాని బ్రస్సెల్స్ ఎయిర్ పోర్టులో జరిగిన ఐఎస్ విధ్వంసంలో భారత్ కు చెందిన ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ కు చెందిన ఉద్యోగి కూడా గల్లంతయ్యాడు. కర్ణాటక రాజధాని బెంగళూరుకు చెందిన రాఘవేంద్రన్ గణేశన్... పేలుళ్లకు ఓ గంట ముందు బ్రస్సెల్స్ ఎయిర్ పోర్టు నుంచే బెంగళూరులోని తన తల్లితో ఫోన్లో మాట్లాడాడు. ఆ తర్వాత ఐఎస్ ఉగ్రవాదులు ఆత్మహుతి దాడులకు పాల్పడటంతో, ఎయిర్ పోర్టులో కల్లోలం చోటుచేసుకుంది. ఈ క్రమంలో గణేశన్ అడ్రెస్ గల్లంతు అయ్యింది. గణేశన్ ఆచూకీ కోసం యత్నిస్తున్నామని భారత విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ చెప్పారు.