: ఉత్తరాఖండ్‌ రాజకీయ సంక్షోభం...మ‌రో ఐదుగురు తమవైపు వ‌చ్చేశారంటున్న బీజేపీ


ఉత్తరాఖండ్‌ రాజకీయ సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న విష‌యం తెలిసిందే. తిరుగుబాటు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి బీజేపీ సిద్ధమవుతోంది. తాజాగా మరో ఐదుగురు కాంగ్రెస్ కూట‌మి సభ్యులు తమకు మద్దతు పలికారని బీజేపీ ఈ రోజు ప్రకటించింది. వీరిలో కొందరు మంత్రులు కూడా ఉన్నారని బీజేపీ అధికార ప్రతినిధి మున్నా సింగ్ చౌహాన్ విలేకరుల సమావేశంలో పేర్కొన్నారు. అయితే వీరి పేర్లను వెల్లడించేందుకు ఆయ‌న నిరాక‌రించారు. దీంతో అసెంబ్లీలో ముఖ్యమంత్రి హరీష్ రావత్ ఈ నెల 28న ఎదుర్కోనున్న‌ విశ్వాస పరీక్షపై స‌ర్వ‌త్ర ఉత్కంఠ నెల‌కొంది. అక్క‌డి కాంగ్రెస్ ప్రభుత్వం మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. ముఖ్యమంత్రి హరీష్ రావత్ తీరును నిరసిస్తూ కొన్ని రోజుల క్రితం 9మంది కాంగ్రెస్ శాసనసభ్యులు తిరుగుబాటు చేయడంతో ఈ పరిస్థితి తలెత్తిన విష‌యం తెలిసిందే.

  • Loading...

More Telugu News