: ఈనెల 28న ఆస్ట్రేలియా పర్యటనకు జైట్లీ
కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్‌జైట్లీ ఈనెల 28న ఆస్ట్రేలియా బయలుదేరనున్నారు. ఐదు రోజుల పాటు ఆస్ట్రేలియాలో పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా అక్కడ నిర్వహించనున్న మేక్ ఇన్ ఇండియా కాన్ఫరెన్స్‌లో జైట్లీ పాల్గొననున్నారు. బహుళజాతి కంపెనీ సీఈవోలతో ఆయన భేటీ అవుతారు. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సిడ్నీ బ్రాంచి ప్రారంభోత్సవంలోనూ జైట్లీ పాల్గొంటారు.