: ఇండిగో విమానాలకు బాంబు బెదిరింపు


శ్రీనగర్- జమ్మూ- ఢిల్లీ మార్గంలో ప్రయాణించే 6ఇ 853 విమానంలో బాంబు ఉన్నట్లు ఇండిగో ఎయిర్ లైన్స్ చెన్నై కాల్ సెంటర్‌కు ఫోన్ వచ్చింది. అంతేగాక ప‌ది ఇండిగో విమానాలకు బుధవారం బాంబు బెదిరింపు ఫోన్ కాల్స్ వ‌చ్చినట్లు స‌మాచారం. దీంతో ఢిల్లీ ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరిన ఇండిగో విమానాన్ని ప్రత్యేక రన్‌వేపై ల్యాండ్ చేశారు. బ్ర‌స్సెల్స్ పేలుళ్ల నేపథ్యంలో దేశంలో అన్ని విమానాశ్రయాలు, మెట్రో స్టేషన్ లలో ఇప్ప‌టికే విస్తృత తనిఖీలు చేపట్టిన విష‌యం తెలిసిందే. తాజాగా బాంబు బెదిరింపు దృష్ట్యా ఢిల్లీ ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇండిగో విమానంనుంచి ప్రయాణికులను దించి క్షుణ్ణంగా త‌నిఖీ చేశారు.

  • Loading...

More Telugu News