: ఎయిర్ ఇండియా వన్ డ్రస్ కోడ్ మారబోతుంది
నూలు వడికి, తను ధరించే వస్త్రాలను తానే తయారు చేసుకునేవారు మహాత్మాగాంధీ. అందులోనుంచి పుట్టుకొచ్చిందే ఖాదీ. అంతటి విశిష్టత వున్న ఈ ఖాదీ వస్త్రాలు ఇకపై 'ఎయిర్ ఇండియా వన్' (భారత ప్రధాని అధికారిక విమానం) సిబ్బందికి డ్రస్ కోడ్ గా మారుతున్నాయి. దేశీయ, ఖాదీ వస్త్రాలను ప్రోత్సహించే ఉద్దేశంతో ఎయిర్ ఇండియా వన్ విమానయాన సంస్థ తన సిబ్బంది డ్రస్ కోడ్‌ను మార్చనున్నట్లు తెలిపింది. మహిళా సిబ్బంది సిల్కు చీరలు, పురుషులు జోధ్‌పురి బంద్‌గల కోట్లు, జాకెట్లు అన్నింటినీ ఖాదీతో రూపొందించేందుకు ఆర్డరిచ్చారు. మహాత్మగాంధీకి నివాళిగా ఖాదీ ప్రోత్సాహం గురించి ప్రధానమంత్రి నరేంద్రమోదీ గతంలో అనేక సార్లు ప్రస్తావించిన సంగతి తెలిసిందే.