: భగత్‌సింగ్, సుఖ్‌దేవ్, రాజ్‌గురులకు ట్విట్టర్‌లో ప్రధాని మోదీ నివాళులు
అమరవీరులు భగత్‌సింగ్, సుఖ్‌దేవ్, రాజ్‌గురును ఉరితీసిన రోజు(మార్చి 23)ను స్మరిస్తూ వారి ఆత్మకు శాంతి చేకూరాలంటూ ప్రధానిమోదీ ట్విట్టర్‌లో నివాళులర్పించారు. వారిని నేటి యువత స్ఫూర్తిగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. తమ తరువాత తరమైనా స్వేచ్ఛా వాయువులు పీల్చుకుంటుందనే భావనతో ఈ ముగ్గురు దేశభక్తులు చిన్న వయస్సులోనే దేశం కోసం ప్రాణాలర్పించారని మోదీ పేర్కొన్నారు. పార్లమెంటుపై బాంబు దాడి కేసులో భగత్‌సింగ్, సుఖ్‌దేవ్, రాజ్‌గురులను నాటి బ్రిటిష్ ప్రభుత్వం మార్చి 23న ఉరి తీసింది. అలాగే, ఈ రోజు సోషలిస్ట్ నాయకుడు రాం మనోహర్ లోహియా జన్మదినం. ఈ సందర్భంగా లోహియా అప్పట్లో మహాత్మా గాంధీకి రాసిన ఓ లేఖను ట్విట్టర్‌లో ఉంచారు.