: ఆత్మాహుతి దాడి జరిపింది అన్నా తమ్ముళ్లు!
బెల్జియం రాజధాని బ్రస్సెల్స్ విమానాశ్రయంపై ఉగ్రదాడి జరిపింది అన్నాతమ్ముళ్లని పోలీసు వర్గాలు గుర్తించాయి. వీరిద్దరూ ఐఎస్ఐఎస్ సూసైడ్ బాంబర్ స్క్వాడ్ కు చెందిన వారని, వారి పేర్లు ఖలీద్ ఎల్ బక్రౌలీ, బ్రహీం ఎల్ బక్రౌలీ అని గుర్తించామని వెల్లడించారు. గాయపడిన వారిలో కొంతమంది పరిస్థితి విషమంగా ఉందని ఆ దేశ ఆరోగ్యమంత్రి మ్యాగీ డీ బ్లాక్ తెలిపినట్టు వీఆర్టీ టెలివిజన్ ప్రకటించింది. నాలుగు రోజుల క్రితం పారిస్ దాడుల సూత్రధారి సలాహ్ అబ్దెస్లామ్ అరెస్టును వ్యతిరేకిస్తూ ఈ దాడులకు పాల్పడినట్టు ఐఎస్ఐఎస్ ప్రకటించిన సంగతి తెలిసిందే