: అన్ని ఆలయాల్లోకీ మహిళలను అనుమతించాలి: ఫరూఖ్ అబ్దుల్లా
బృందావన్‌లో వితంతు మహిళలంతా కలసి హోలీ సంబరాలు జరుపుకోవడాన్ని జమ్ము కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూఖ్ అబ్దుల్లా అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇది అద్భుతమైన, అందరూ గర్వించదగిన సంఘటన అని అభివర్ణించారు. అన్ని ఆలయాల్లోకి మహిళలను అనుమతించాలని అన్నారు. దేశం సానుకూల పద్ధతిలో ముందుకెళుతోందని అన్నారు. అనంతరం జమ్మూకాశ్మీర్‌లో ప్రభుత్వ ఏర్పాటుపై మాట్లాడుతూ బీజేపీ, పీడీపీ నుంచి సానుకూల ప్రకటన రావాలన్నారు. ప్రభుత్వ ఏర్పాటుపై కొన్ని నెలల నుంచి ఎదురుచూస్తున్నామని, ఇక వారు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారని ఆశిస్తున్నట్లు తెలిపారు. బ్రస్సెల్స్ ఉగ్రదాడులపై స్పందిస్తూ ప్రపంచమంతా కలిసి ఉగ్రవాదంపై పోరాడాలని వ్యాఖ్యానించారు.