: పోలీసులు అడుగ‌డుగునా అడ్డుకునే ప్ర‌య‌త్నం చేస్తున్నారు: క‌న్న‌య్య‌


త‌న‌ని పోలీసులు అడుగ‌డుగునా అడ్డుకునే ప్ర‌య‌త్నం చేస్తున్నారని ఢిల్లీ జవహర్ లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం స్టూడెంట్స్ యూనియన్ నాయ‌కుడు కన్నయ్య కుమార్ ఆరోపించారు. హైదరాబాద్‌కు చేరుకున్న తర్వాత మీడియాతో మాట్లాడుతూ.. రోహిత్‌ తల్లిని పరామర్శించేందుకు ఇక్కడికి వచ్చానని అన్నారు. 'రోహిత్‌ చట్టం' చేసే వరకు పోరాడుతానని అన్నారు. సాయంత్రం నిర్వహించే సభలో పాల్గొంటానని తెలిపారు. విశ్వవిద్యాలయాల్లో సామాజిక న్యాయం కోసం ప్రయత్నిస్తున్నానని పేర్కొన్నారు. మ‌రోవైపు హెచ్‌సీయూకి వ‌చ్చేందుకు క‌న్న‌య్య‌కు అనుమ‌తి లేద‌ని పోలీసులు తెలిపారు. హెచ్‌సీయూలో మీడియాపై ఆంక్ష‌లు విధించారు. పోలీసులు మీడియాను వ‌ర్సిటీలోకి అనుమ‌తించట్లేదు. రాజ‌కీయ నాయ‌కులు, ఇత‌ర విద్యార్థి సంఘాల‌కు కూడా హెచ్‌సీయూలోకి అనుమ‌తిని నిరాక‌రిస్తున్నారు.

  • Loading...

More Telugu News