: ఈశాన్య రాష్ట్రాలకు బ్రాడ్‌బ్యాండ్ క‌నెక్టివిటీ... నేడు ప్రారంభించనున్న మోదీ


టెలికామ్‌ సేవలను మెరుగుపరచడ‌మే ల‌క్ష్యంగా ప్రధాని నరేంద్రమోదీ నేడు ఈశాన్య రాష్ట్రాల్లో బ్రాడ్‌ బ్యాండ్ క‌నెక్టివిటీని ప్రారంభించ‌నున్నారు. దీనిద్వారా ఈశాన్య రాష్ట్రాలలో టెలికాం స‌ర్వీసు మరింత బ‌ల‌ప‌డ‌నుంది. దీనికోసం అగర్తలాలో బ్రాడ్‌బ్యాండ్‌ కనెక్టివిటీ కేంద్రాన్ని ఏర్పాటు చేయ‌నున్నారు. దీనిపై ఇప్ప‌టికే బీఎస్‌ఎన్‌ఎల్‌, బంగ్లాదేశ్‌ సబ్‌మెరైన్ కేబుల్ కంపెనీ లిమిటెడ్ మ‌ధ్య‌ ఒప్పందం కుదిరింది. ఈ విష‌య‌మై గ‌త ఏడాది జూన్‌లో బంగ్లాదేశ్‌-ఇండియా ప్ర‌ధానుల స‌మ‌క్షంలో ఒప్పందం కుదిరింది. బంగ్లాదేశ్ ద్వారా ఈ కనెక్టివిటీని ఏర్పాటు చేస్తారు.

  • Loading...

More Telugu News