: నన్ను‘ఖట్టార్’ అని పిలవొద్దు: జాట్‌ల ఆందోళన నేపథ్యంలో హర్యానా సీఎం
ఓబీసీ రిజర్వేషన్ల కోసం హర్యానాలో జాట్ లు చేస్తున్న పోరాటం ప్రభుత్వానికి తలనొప్పిగా మారిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్ర సీఎం మనోహర్ లాల్ ఖట్టార్.. కులం పేరు సూచించే తన ఇంటి పేరు ‘ఖట్టార్’ను తొలగించుకుంటున్నారు. కేవలం మనోహర్ అని పిలిస్తే చాలని ఎమ్మెల్యేలకు సూచించారు. ప్రత్యేకంగా కులం పేరు సూచించే ‘ఖట్టార్’ను సంబోధించాల్సిన అవసరం లేదని సూచించారు. ప్రభుత్వ ఉద్యోగాలు, యూనివర్సిటీల్లో ఓబీసీ రిజర్వేషన్లు కోరుతూ.. హర్యానాలో జాట్‌లు చేస్తున్న ఆందోళన పలుసార్లు ఉద్ధృతంగా మారుతోంది. పరిస్థితి చేయిదాటుతుండటంతో.. హర్యానా సర్కారు పలుసార్లు ఆర్మీని కూడా రంగంలోకి దించింది. ఈ నేపథ్యంలో సీఎం ఖట్టార్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.