: ఎట్టకేలకు దొంగలు సాధించారు!... ఏటీఎంలో క్యాష్ ఎత్తుకెళ్లారు!
ఏటీఎంలలో చోరీకి యత్నించిన దొంగలు ఇప్పటిదాకా అనుకున్న ఫలితం సాధించలేకపోయారు. ఎందుకంటే... ఏటీఎంలలో వాడే డబ్బుల యంత్రాలను పగులగొట్టడం వారి చేత కాలేదు. ఒకవేళ యంత్రాన్ని పగులగొట్టినా, డబ్బు ఉన్న బాక్సును వారు చేజిక్కించుకోలేకపోయారు. అయితే నిన్న రాత్రి తెలంగాణలోని మెదక్ జిల్లా రామాయంపేట మండలం నిజాంపేటలో జరిగిన చోరీలో దొంగల యత్నం ఫలించింది. నిజాంపేటలోని ఇండీక్యాష్ ఏటీఎంలోకి ప్రవేశించిన దొంగలు ఏటీఎం యంత్రాన్ని పగులగొట్టారు. యంత్రంలోని క్యాష్ బాక్స్ ను ఓపెన్ చేయగలిగిన దొంగలు అందులోని నగదును ఎత్తుకెళ్లారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న మెదక్ జిల్లా పోలీసులు దొంగల కోసం వేట సాగిస్తున్నారు.