: 9 రన్ రేట్ తో పరుగులు సాధిస్తున్న పాక్!


నిలకడలేని ఆటతీరుతో విమర్శలు ఎదుర్కొనే పాకిస్థాన్ ఆటగాళ్లు భారత్ తో ఓటమి అనంతరం విజయం కోసం రగిలిపోతున్నట్టు కనిపిస్తున్నారు. మొహాలీ వేదికగా న్యూజిలాండ్ తో జరుగుతున్న టీ20 మ్యాచ్ లో పాక్ బ్యాట్స్ మన్ ఆకట్టుకున్నారు. 181 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన పాక్ ఆటగాళ్లు భారీ లక్ష్యాన్ని చూసి ఏమాత్రం జంకుగొంకు లేకుండా బ్యాటు ఝుళిపిస్తున్నారు. ఓపెనర్ షెర్జిల్ ఖాన్ (48) విరుచుకుపడగా, మరో ఓపెనర్ అహ్మద్ షెహజాద్ (30) ఆకట్టుకున్నాడు. షెర్జిల్ ఖాన్ పెవిలియన్ చేరడంతో నెమ్మదించిన స్కోరు బోర్డు ఖలీద్ లతీఫ్ (3) అవుట్ కావడంతో మరింత నెమ్మదించింది. స్కోరు బోర్డుకు మరింత వేగం తెచ్చే క్రమంలో షెహజాద్ కూడా పెవిలియన్ చేరాడు. దీంతో పాక్ జట్టు 12.2 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 101 పరుగులు చేసింది. క్రీజులో ఉమర్ అక్మల్ (8), షాహిద్ అఫ్రిదీ (0) ఉన్నారు. న్యూజిలాండ్ స్పిన్నర్లు ఆకట్టుకున్నారు.

  • Loading...

More Telugu News