: బ్రస్సెల్స్‌లో బాలీవుడ్ గాయకుని కుటుంబం.. గాడ్ ఈజ్ గ్రేట్ అంటూ ట్వీట్
ప్రముఖ బాలీవుడ్ గాయకుడు అభిజిత్ భట్టాచార్య కుటుంబం బ్రస్సెల్స్ విమానాశ్రయంలో పేలుళ్ల ఘటన సమయంలో అక్కడే ఉంది. తన భార్య సుమతి భట్టాచార్య, కుమారుడు క్షేమంగా ఉన్నారంటూ.. తన కుటుంబం గురించి అభిజిత్ భట్టాచార్య ట్విట్టర్లో పోస్ట్ చేశారు. పేలుళ్లు జరిగిన విమానాశ్రయంలో తమ వారు చిక్కుకోవడం చాలా ఆందోళన కలిగించిందని తెలిపారు. అదృష్టవశాత్తూ వారు క్షేమంగా ఉండడం సంతోషంగా ఉందని, గాడ్ ఈజ్ గ్రేట్ అంటూ స్పందించారు. బెల్జియం రాజధానిలోని విమానాశ్రయంలో పేలుళ్ల వార్త తనకు చాలా బాధ కలిగించిందని అభిజిత్ అన్నారు. బెల్జియం రాజధాని బ్రస్సెల్స్ వరుస బాంబు పేలుళ్లతో దద్దరిల్లిన విషయం తెలిసిందే. ఈ ఘటనల్లో మృతుల సంఖ్య 23కి చేరింది.