: 30కిలోల డ్రగ్స్‌తో ఎయిర్ హోస్టెస్ పారిపోయింది
ఎయిర్‌హోస్టెస్‌గా పనిచేస్తున్న ఓ యువతి లాస్‌ఏంజెల్స్ విమానాశ్రయంలో డ్రగ్స్ ఉన్న బ్యాగ్‌తో పరారైంది. తనిఖీ సిబ్బందికి చిక్కకుండా తన వద్ద ఉన్న లగేజీని సైతం వదిలేసి ఆమె పారిపోయింది. సిబ్బంది తనిఖీల్లో ఆ యువతి బ్యాగ్‌లో 30 కిలోల కొకైన్ ఉన్నట్లు గమనించగా వెంటనే తన వద్ద ఉన్న లగేజీని వదిలేసి, డ్రగ్స్ ఉన్న బ్యాగ్‌తో అక్కడి నుంచి తప్పించుకుంది. ఆమె ఏ ఎయిర్‌లైన్స్ లో పనిచేస్తోందన్న వివరాలపై దర్యాప్తు చేపడుతున్నామని అధికారులు తెలిపారు.