: ఆవు పెళ్లికి బంగారు ఆభరణాలు...వందల సంఖ్యలో అతిథులు
బీజేపీ అధికారంలోకి వచ్చిన తరువాత గో సంరక్షణపై పెద్ద ఉద్యమమే మొదలైంది. ఈ నేపథ్యంలో గోవులను ఇంట్లో పిల్లల్లా పెంచుకుంటున్నామంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ గోభక్తిని చాటుకుంటున్నారు. ఈ నేపథ్యంలో గుజరాత్ లోని అహ్మదాబాద్ లోని ఓ ఛారిటబుల్ ట్రస్ట్ పెంచుకుంటున్న పూనమ్ అనే ఆవుకి అర్జున్ అనే ఎద్దుతో వివాహం నిశ్చయించారు. దీంతో పూనమ్, అర్జున్ లకు బంగారు ఆభరణాలు చేయిస్తున్నామని ట్రస్ట్ నిర్వాహకులు తెలిపారు. వీటి వివాహానికి 700 మంది అతిథులను ఆహ్వానిస్తున్నామని వారు వెల్లడించారు. వీటిని సొంత బిడ్డల్లా పెంచుకుంటున్నామని, అందుకే వీటి వివాహం అట్టహాసంగా జరపాలని నిర్ణయించామని ఆయన వివరించారు.