: ‘వైశ్రాయ్’ ఎండీ ఇంటి ముందు బ్యాంకు ఉద్యోగుల ధర్నా
బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలను తిరిగి చెల్లించాలంటూ వైశ్రాయ్ హోటల్ ఎండీ ప్రభాకర్ రెడ్డి ఇంటిముందు ఓరియంటల్ బ్యాంకు ఆఫ్ కామర్స్ (ఓబీసీ) ఉద్యోగులు ఈరోజు ధర్నాకు దిగారు. మొండి బకాయిలు రాబట్టుకునే ప్రయత్నాల్లో భాగంగానే ఈ ధర్నాకు దిగామని బ్యాంకు సిబ్బంది పేర్కొన్నారు. బ్యాంకు నుంచి తీసుకున్న కోట్లాది రూపాయల రుణాన్ని ఆయన తిరిగి చెల్లించలేదని అన్నారు. ‘ప్లీజ్ పే అవర్ డ్యూస్’ అని రాసి ఉన్న ప్లకార్డులను బ్యాంకు సిబ్బంది ప్రదర్శించారు.