: మహిళలు గర్వించదగిన తీర్పు: ఎమ్మెల్యే బోండా ఉమ
ఈరోజు డివిజన్ బెంచ్ ఇచ్చిన తీర్పు యావత్తు మహిళలు గర్వించదగినదని టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమ అన్నారు. ఎమ్మెల్యే రోజా ఏడాది సస్పెన్షన్ తీర్మానాన్ని ఎత్తివేస్తూ సింగిల్ బెంచ్ ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను డివిజన్ బెంచ్ ఈరోజు కొట్టి వేసింది. ఈ నేపథ్యంలోనే ఉమ ఈ వ్యాఖ్యలు చేశారు. శాసనసభలో ఇటీవల తాను చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకున్న విషయాన్ని ఆయన ప్రస్తావించారు. వైఎస్సార్సీపీ కి చెందిన మరో ఎమ్మెల్యే కొడాలి నానిపై కూడా ఏడాదిపాటు వేటు వేయాలని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రభుత్వం ఉదారంగా వ్యవహరించినందువల్లే ప్రివిలేజ్ కమిటీ ముందు హాజరయ్యే అవకాశం వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలకు కలిగిందని అన్నారు. వైఎస్సార్సీపీ విప్ జారీ చేసిన విషయాన్ని ఆయన ప్రస్తావిస్తూ, ఆ విప్ కు ఎటువంటి విలువ లేదని, ద్రవ్య వినిమయ బిల్లుకు వ్యతిరేకంగా వారు ఓటు వేసినా ఎటువంటి నష్టం వాటిల్లదని ఉమ అన్నారు.