: రేపు హెచ్‌సీయూకి కన్నయ్య
దేశద్రోహం కేసులో అరెస్టై, మధ్యంతర బెయిలుపై విడుదలైన ఢిల్లీలోని జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీ విద్యార్థి సంఘం నాయకుడు కన్నయ్యకుమార్ బుధవారం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి రానున్నారు. వర్సిటీలో దళిత విద్యార్థి వేముల రోహిత్ ఆత్మహత్యపై కన్నయ్య పలువురు విద్యార్థులతో చర్చించే అవకాశం ఉంది. రోహిత్ వేముల సంతాపసభలో కన్నయ్య పాల్గొననున్నట్లు సమాచారం. అయితే, మరోపక్క హైదరాబాదు సెంట్రల్ యూనివర్సిటీలో నేటి ఉదయం నుంచి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నేటి ఉదయం వర్సిటీలోకి రీ ఎంట్రీ ఇచ్చిన వీసీ అప్పారావు... ఇన్ చార్జీ వీసీగా ఉన్న పెరియాస్వామి నుంచి బాధ్యతలు తీసుకున్నారు. వెనువెంటనే తనకు అనుకూలంగా ఉన్న ప్రొఫెసర్లతో ఆయన భేటీ అయ్యారు. ఈ విషయం తెలుసుకున్న విద్యార్థులు ఆందోళనకు దిగారు. ప్రస్తుతం కేంద్ర బలగాల కవాతుతో వర్సిటీ ప్రాంగణం హోరెత్తుతోంది. ఈ నేపథ్యంలో కన్నయ్య బుధవారం హెచ్‌సీయూకి రావాలనుకోవడం మరింత చర్చనీయాంశమైంది.