: చీటింగ్ కేసులో తమిళ పవర్ స్టార్ అరెస్టు!


ప్రముఖ తమిళ నటుడు, 'పవర్ స్టార్' శ్రీనివాసన్ ను ఈ ఉదయం చెన్నై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అరెస్టు చేశారు. ప్రకాశం జిల్లాకు చెందిన పీఎస్ రంగనాథన్ అనే వ్యక్తి చెన్నై పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేయడంవల్లే శ్రీనివాసన్ ను అదుపులోకి తీసుకున్నామని పోలీసులు వెల్లడించారు. వెంటనే అతడిని రిమాండుకు పంపామన్నారు. రూ.20 కోట్ల సెక్యూర్ లోన్ వ్యవహారంలో నటుడు తననుంచి రూ.50 లక్షలు కమిషన్ తీసుకున్నట్లు రంగనాథన్ ఆరోపించాడని చెప్పారు. అయితే లోన్ వచ్చాక తనకు డబ్బు ఇవ్వకుండా మోసం చేశాడని బాధితుడు చెప్పినట్లు వివరించారు. ఇంకా పలువురిని శ్రీనివాసన్ మోసం చేసినట్లు పోలీసులు చెబుతున్నారు. పలు తమిళ చిత్రాల్లో నటించిన శ్రీనివాసన్ తనకు తానే 'పవర్ స్టార్' అనే బిరుదు తగిలించుకున్నారు.

  • Loading...

More Telugu News