: బ్రెసెల్స్ ఎయిర్ పోర్టులో జంట పేలుళ్లు... పలువురు మృతి


బెల్జియం రాజధాని బ్రెసెల్స్ లోని జావెంటమ్ ఎయిర్ పోర్టులో ఈరోజు ఉదయం జంట పేలుళ్లు సంభవించాయి. పలువురు మృతి చెందగా, మరికొందరికి తీవ్ర గాయాలయ్యాయి. డిపార్చర్ విభాగంలో ఈ జంట పేలుళ్లు సంభవించినట్లు ఎయిర్ పోర్ట్ సొంత ట్విట్టర్ ఖాతా ద్వారా ద్రువీకరించింది. ఈ సంఘటన నేపథ్యంలో బెల్జియం ప్రభుత్వం హై అలర్ట్ ప్రకటించింది. ఎయిర్ పోర్టు పరిసర ప్రాంతాలకు ప్రజలను రావద్దంటూ ప్రభుత్వం హెచ్చరించింది. కాగా, ఎయిర్ పోర్టులో పేలుళ్ల శబ్దాలు వినిపించడంతో ప్రయాణికులు భయాందోళనలతో ఎటువారు అటు పరుగులు తీశారు.

  • Loading...

More Telugu News