: 24న పీడీపీ శాసనసభాపక్ష సమావేశం నిర్వహిస్తాం: మెహబూబా ముఫ్తీ


జ‌మ్మూకాశ్మీర్‌లో ప్రభుత్వ ఏర్పాటుపై ప్రధాని నరేంద్ర‌మోదీతో న్యూఢిల్లీలో చ‌ర్చిస్తోన్న పీడీపీ అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తీ భేటీ ముగిసింది. ఈనెల 24న‌ (గురువారం) పీడీపీ శాసనసభాపక్ష సమావేశం నిర్వహిస్తున్నామని భేటీ అనంత‌రం ఆమె తెలిపారు. శ్రీనగర్‌ వెళ్లిన తర్వాత తదుపరి కార్యాచరణ ప్రకటిస్తానని తెలిపారు. త్వ‌ర‌లోనే తుది నిర్ణయం తీసుకుంటామని మెహబూబా చెప్పారు. సానుకూల‌ వాతావరణంలో ప్రధానితో చర్చలు జరిగినట్లు పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News