: హెచ్ సీయూలో మరోమారు టెన్షన్!... వీసీ కుర్చీలో అప్పారావు, బంగ్లాపై విద్యార్థుల దాడి


రీసెర్చి స్కాలర్ రోహిత్ వేముల ఆత్మహత్యతో అప్పటిదాకా ప్రశాంతంగా ఉన్న హైదరాబాదు సెంట్రల్ యూనివర్సిటీ ఒక్కసారిగా నిప్పుల కుంపటిలా మారిపోయింది. విద్యార్థులపై కఠినంగా వ్యవహరించే మనస్తత్వమున్న వీసీ అప్పారావును విధుల నుంచి తప్పిస్తే తప్పించి ఆందోళనలు విరమించేది లేదని విద్యార్థులు తేల్చిచెప్పారు. ఈ క్రమంలో పలు నాటకీయ పరిణామాల్లో సుదీర్ఘ సెలవు పెట్టిన అప్పారావు వీసీ పదవీ బాధ్యతలను వేరేవారికి అప్పగించి వెళ్లిపోయారు. తాజాగా నేటి ఉదయం అప్పారావు తన సెలవు ముగించుకుని వర్సిటీకి వచ్చారు. ఇన్ చార్జీ వీసీగా ఉన్న పెరియాస్వామి నుంచి ఆయన బాధ్యతలను తీసుకున్నారు. విషయం తెలుసుకున్న విద్యార్థులు భగ్గుమన్నారు. వీసీగా అప్పారావును ఒప్పుకునేది లేదని ఆందోళనకు దిగారు. అంతటితో ఆగని విద్యార్థులు వీసీ బంగ్లాను ముట్టడించి పెద్ద పెట్టున నినాదాలు చేస్తున్నారు. ఆ తర్వాత బంగ్లాపై దాడికి దిగిన విద్యార్థులు ఇంటిలోని ఫర్నీచర్ ను ధ్వంసం చేశారు. దీంతో రోజుల తరబడి ఆందోళనలతో అట్టుడికిన హెచ్ సీయూలో మరోమారు హైటెన్షన్ వాతావరణం చోటుచేసుకుంది.

  • Loading...

More Telugu News