: వైసీపీ ఎమ్మెల్యేలకు విప్ జారీ!... ‘ద్రవ్య’ బిల్లుపై ఓటింగ్ కు హాజరుకావాలని ఆదేశం
ఏపీ అసెంబ్లీలో వైసీపీ విప్ ల జారీ కొనసాగుతోంది. ఇప్పటికే టీడీపీ ప్రభుత్వం, స్పీకర్ కోడెల శివప్రసాద్ లపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టిన వైసీపీ.. ఆ రెండు సందర్భాల్లో తన ఎమ్మెల్యేలకు విప్ జారీ చేసింది. విప్ జారీ చేసినా, ఆ రెండు అవిశ్వాస తీర్మానాల్లోనూ వైసీపీ ఘోర పరాజయం పాలైంది. తాజాగా మరోమారు విప్ ను జారీ చేస్తూ ఆ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. నేటి సమావేశాల్లో భాగంగా ద్రవ్య వినిమయ బిల్లుపై జరగనున్న ఓటింగ్ లో తప్పనిసరిగా పాల్గొనాలని తన ఎమ్మెల్యేలకు ఆదేశాలు జారీ చేసింది. మొత్తం వైసీపీ ఎమ్మెల్యేలు హాజరై ఓటేసినా, బిల్లుకు ఎలాంటి ఇబ్బంది లేకున్నప్పటికీ వైసీపీ నుంచి విప్ జారీ కావడం గమనార్హం.