: ఫిల్మ్ నగర్ లో మరో వేధింపుల పర్వం!... ఫిర్యాదు చేసేందుకు వచ్చిన మహిళపై హోంగార్డు వెకిలి చేష్టలు


మద్యం మత్తులో నడిరోడ్డుపై నడుచుకుంటూ వెళుతున్న ఓ మహిళను చేయి పట్టి లాగి కారులోకి ఎక్కించుకునేందుకు యత్నించిన టీడీపీ సీనియర్ నేత, ఏపీ మంత్రి రావెల కిశోర్ బాబు పుత్రరత్నం రావెల్ సుశీల్ ఘటనను మరిచిపోకముందే హైదరాబాదులోని ఫిల్మ్ నగర్ లో మరో వేధింపుల పర్వం వెలుగు చూసింది. నిత్యం వేధింపులకు గురి చేస్తున్న భర్త నుంచి తనకు రక్షణ కల్పించాలని పోలీస్ స్టేషన్ కు వచ్చిన ఓ మహిళపై సురేశ్ అనే హోంగార్డు వెకిలి చేష్టలకు పాల్పడ్డాడు. ‘చీరలో అందంగా ఉన్నావు’ అంటూ ఆ హోంగార్డు చేసిన వ్యాఖ్యలు బాధిత మహిళను ఆగ్రహానికి గురి చేశాయి. దీంతో ఆమె తన బంధువులు, స్థానికుల సహాయంలో సురేశ్ కు బుద్ధి చెప్పింది. హోంగార్డును చితకబాదిన స్థానికులు ఆ తర్వాత అతడిని బంజారాహిల్స్ పోలీసులకు అప్పగించారు.

  • Loading...

More Telugu News