: నా పాస్ పోర్ట్ తిరిగి ఇప్పించండి: సినీ నటుడు సంజయ్ దత్


ప్రముఖ బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన పాస్ పోర్టు విషయమై ప్రత్యేక టాడా కోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. తన పాస్ పోర్టును వెనక్కి ఇప్పించాలంటూ ఆ పిటిషన్ లో పేర్కొన్నాడు. ఈ పాస్ పోర్టు పిటిషన్ పై రేపు టాడా కోర్టు తీర్పు ఇవ్వనుంది. కాగా, 1993లో ముంబయి దాడుల సమయంలో అక్రమ ఆయుధాలు వినియోగించిన కేసులో 2007లో ప్రత్యేక కోర్టు సంజయ్ దత్ కు ఆరేళ్ల జైలు శిక్ష విధించింది. సత్ప్రవర్తన కారణంగా జైలు శిక్షను తగ్గించడంతో ఇటీవలే సంజయ్ దత్ విడుదలైన విషయం తెలిసిందే.

  • Loading...

More Telugu News