: రోజా కేసులో ముగిసిన వాదనలు... తీర్పు రేపే
చిత్తూరు జిల్లా నగరి శాసనసభ సభ్యురాలు రోజా ఏడాది సస్పెన్షన్ ను నిలుపుదల చేస్తూ హైకోర్టు సింగిల్ జడ్జ్ ఇచ్చిన తీర్పుపై, శాసనసభ కార్యదర్శి హైకోర్టు డివిజన్ బెంచ్ కు చేసిన అప్పీలుపై వాదనలు ముగిశాయి. ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు తీర్పును రేపటికి వాయిదా వేసింది. కాగా, శాసనసభలో రోజా సస్పెన్షన్ పై ఈ రోజు చర్చ జరిగిన సంగతి తెలిసిందే. ఆమెపై ఏడాది సస్పెన్షన్ సరైన నిర్ణయమేనని అధికారపక్షం నిర్ణయించగా, విపక్షం నేటి సభను బహిష్కరించిన సంగతి తెలిసిందే.