: నేషనల్ హెరాల్డ్ కేసు.. ఏప్రిల్ 8కి విచారణ వాయిదా


నేషనల్ హెరాల్డ్ పత్రిక నిధుల దుర్వినియోగం కేసు విచారణను ఢిల్లీ కోర్టు ఏప్రిల్‌8కి వాయిదా వేసింది. పాటియాలా హౌస్ కోర్టులో ఈరోజు ఈ కేసు విచారణ జ‌రిగింది. గ‌తంలో కోర్టు ఆదేశించిన మేరకు 2010-11 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఇండియ‌న్ నేష‌న‌ల్ కాంగ్రెస్ ఆర్థిక వివరాలు పార్టీ ఆఫీస్ బేరర్స్ నుంచి ఇంకా అందలేద‌ని కాంగ్రెస్ తరఫున హాజరైన న్యాయవాది కోర్టుకి విన్నవించారు. అనంత‌రం న్యాయ‌వాది విజ్ణప్తి మేరకు కోర్టు కేసును వచ్చేనెల 8కి వాయిదా వేసింది. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఆమె కుమారుడు రాహుల్ గాంధీ నేషనల్ హెరాల్డ్ పత్రిక నిధుల దుర్వినియోగం కేసులో విచార‌ణను ఎదుర్కొంటోన్న సంగ‌తి తెలిసిందే.

  • Loading...

More Telugu News