: చదువుకున్నోడికన్నా చాకలోడు మేలు: అసెంబ్లీలో ధూళిపాళ్ల వివాదాస్పద వ్యాఖ్య


ఏపీ అసెంబ్లీలో రోజా వివాదంపై ప్రివిలేజ్ కమిటీ ఇచ్చిన నివేదికపై చర్చ జరుగుతున్న వేళ తెలుగుదేశం ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర వివాదాస్పద వ్యాఖ్య చేశారు. వైకాపా ఎమ్మెల్యేలు సభలో దారుణంగా ప్రవర్తిస్తున్నారని చెబుతూ, చదువుకున్నోడికన్నా చాకలోడు మేలన్నట్టు... సామెత వినిపించారు. వైకాపా నేతలు బయట కూడా అహంకారపూరిత వైఖరిని ప్రదర్శిస్తున్నారని, అనిత, బొండా ఉమతో పాటు రోజా బాధితులు చాలా మందే ఉన్నారని చెప్పుకొచ్చారు. వీళ్లు మాట్లాడే భాషను చూస్తే, బయటి ప్రజలు తరిమి కొడతారని అన్నారు. రోజాను సంవత్సరం పాటు సస్పెండ్ చేయాలన్న సభ నిర్ణయానికి తాను మద్దతిస్తున్నానని, సభ సాక్షిగా రోజా జుగుప్సాకరమైన వ్యాఖ్యలు చేశారని, ఆమెకు ఎంత శిక్ష పడ్డా తక్కువేనని అన్నారు. కాగా, ధూళిపాళ్ల ప్రసంగించే సమయంలో విపక్షం సభలో లేదు.

  • Loading...

More Telugu News