: ఏనుగుల దాడిలో రైతులు దుర్మరణం


పశ్చిమబెంగాల్ లో ఏనుగులు రెచ్చిపోయాయి. బుర్వాన్ జిల్లాలోని ముల్తేశ్వర్ గ్రామంలోకి వచ్చిన ఏనుగులు విరుచుకుపడి నలుగురు రైతుల ప్రాణాలు తీశాయి. మరికొందరిని గాయపర్చాయి. ఏనుగుల దాడితో భీతిల్లిన గ్రామస్థులు భయంతో పరుగులు తీశారు. ఈ సమాచారం అందుకున్న ఫారెస్ట్ అధికారులు ఈ ఏనుగులను తరిమికొట్టారు. కాగా, ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ, గ్రామానికి సమీపంలో ఉన్న అటవీ ప్రాంతంలో నుంచి ఏనుగులు తరచుగా వచ్చి ఈ తరహా దాడులకు పాల్పడుతుంటాయని, ఈ విషయమై అటవీశాఖాధికారులకు ఎన్నిసార్లు చెప్పినా సరైన చర్యలు తీసుకోవడం లేదని గ్రామస్తులు ఆరోపించారు.

  • Loading...

More Telugu News