: పవన్ మాటల్లో సహజత్వం కనిపించింది, చిరంజీవి ప్రసంగం శక్తిమంతంగా ఉంది: వర్మ ట్వీట్
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ పై ప్రముఖ సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ట్విట్టర్లో స్పందించారు. ‘సర్దార్ గబ్బర్‌సింగ్’ చిత్రం ఆడియో విడుదల వేడుక ఆదివారం జరిగిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా వేదికపై మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ చేసిన ప్రసంగంలో ఒకరిని గురించి మరొకరు ఉద్దేశించి మాట్లాడారు. ఈ అంశంపై రామ్‌గోపాల్ వర్మ ట్విట్టర్ ద్వారా స్పందించారు. పవన్‌కల్యాణ్ మాటల్లో సహజత్వం కన్పించిందని, చిరంజీవి ప్రసంగం శక్తిమంతంగా, సహజత్వానికి దగ్గరగా ఉన్నట్లు అనిపించిందని ఆయన ట్వీట్ చేశారు. అన్నదమ్ముల అనుబంధం మెగా వేదికపై కనిపించిందని పేర్కొన్నారు. ఇక సర్దార్ గబ్బర్‌సింగ్ ట్రైలర్‌పై కూడా వర్మ స్పందించారు. ‘మంచికి దగ్గరగా, అద్భుతానికి చేరువగా, అతిశయానికి అతి సామాన్యంగా ఉంది కానీ బ్రహ్మాండంగా ఉంద'న్నారు. చివరికి కొసమెరుపుగా 'జై పవన్ కల్యాణ్' అంటూ ట్వీట్ చేశారు.