: ఇండియా మ్యాప్ పై 'భారత్ మాతాకీ జై' అని రక్తంతో రాసిన ముస్లిం
భరతమాతకు జై కొట్టనని చెప్పి, ఏఐఎంఐఎం నేత అసదుద్దీన్ ఓవైసీ విమర్శలు ఎదుర్కొన్న వేళ, మహమ్మద్ ఇమామ్ అనే వ్యక్తి ఇండియా మ్యాప్ పై రక్తంతో 'భారత్ మాతాకీ జై' అని రాశాడు. ఈ ఘటన ఇటీవల మీరట్ లో జరిగింది. భారత అనుకూల నినాదాలు చేయరాదని ఇస్లాం చెప్పలేదని, కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమే ఓవైసీ ఈ వ్యాఖ్యలు చేశారని ఆయన విమర్శించారు. "భారత మాతకు జై కొట్టడమంటే, ఉన్న భూమిని, మహిళలకు, దేశాన్ని కాపాడుతున్న సైనికులకు జేజేలు పలకడమే. ఓవైసీ వ్యాఖ్యలు ఆమోదయోగ్యం కాదు. ఆయన వద్ద బీఆర్ అంబేద్కర్ చిత్రాలు ఉంటాయి. అంబేద్కర్ ఏం చెప్పారు ఓవైసీ?..." అని ఇమామ్ ప్రశ్నించాడు. ఓ సిరంజి సాయంతో తన మణికట్టు నుంచి రక్తాన్ని తీసి ఆయన భరతమాతకు జై కొట్టాడు.