: హామీ ఇచ్చి, నెరవేర్చే దిశగా అడుగులు పడని అంశం ఇదొక్కటే, చేసి చూపిస్తాం: కేసీఆర్
తమ పార్టీ ఎన్నికలకు ముందు మ్యానిఫెస్టోలో చేర్చిన అంశాల్లో 'కేజీ టూ పీజీ ఉచితవిద్య' అమలు దిశగా ఇంకా అడుగులు వేయలేకపోయామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యాఖ్యానించారు. అసెంబ్లీలో ప్రైవేటు స్కూళ్లు, పాఠశాలల ఫీజుల దందాపై చర్చ జరుగుతున్న వేళ, కేసీఆర్ మాట్లాడారు. అధిక ఫీజుల గురించి తనకు కూడా తెలుసునని అన్నారు. ఇప్పటికిప్పుడు ఏమీ చేయలేని స్థితిలో ఉన్నామని, ఏం చేసినా అది విద్యార్థుల భవిష్యత్తును ప్రభావితం చేస్తుందని గుర్తు చేశారు. తామిచ్చిన హామీల్లో ఒక్క 'కేజీ టూ పీజీ ఉచితవిద్య' సాకారం దిశగా మాత్రమే ఇంకా అడుగులు పడలేదని, దీన్ని కూడా చేసి చూపిస్తామని స్పష్టం చేశారు. ఇందుకోసం అసెంబ్లీలో ప్రత్యేక సమయం కేటాయించి చర్చిద్దామని, సభ్యులు నిర్మాణాత్మక సలహా, సూచనలు ఇస్తే తప్పకుండా పాటిస్తామని తెలిపారు.