: చిత్తూరు యాక్సిడెంట్ పై చంద్రబాబు, లోకేశ్ దిగ్భ్రాంతి... చనిపోయిన నేతలకు సంతాపం


చిత్తూరు జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంపై టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. నేటి తెల్లవారుజామున చిత్తూరు నగర శివారు యాదమరి మండలం ముత్తిరేవుల క్రాస్ వద్ద చెన్నై-బెంగళూరు హైవేపై జరిగిన ఈ ప్రమాదంలో చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలోని శాంతిపురం మండల టీడీపీ అధ్యక్షుడు వెంకటమునిరెడ్డి, పార్టీ నేతలు బాలకృష్ణ, సురేశ్ లు చనిపోయిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న చంద్రబాబు, లోకేశ్ లు షాక్ కు గురయ్యారు. వెంటనే పార్టీ చిత్తూరు జిల్లా నేతలకు ఫోన్ చేసి వివరాలు తెలుసుకున్న వారిద్దరూ చనిపోయిన పార్టీ నేతల కుటుంబాలకు తమ ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు.

  • Loading...

More Telugu News