: కర్ణాటకలో రేవ్ పార్టీ... అసభ్య నృత్యాలు చేస్తున్న 10 మంది హైదరాబాదీ యువతుల అరెస్ట్


కర్ణాటకలో మరోమారు రేవ్ పార్టీ జోరు హోరెత్తుతోంది. నిన్న రాత్రి వీకెండ్ ను పురస్కరించుకుని ఆ రాష్ట్రంలోని కోలార్ జిల్లా మలూరులో రేవ్ పార్టీలో యువత చిందులు తొక్కింది. దీనిపై పక్కా సమాచారం అందుకున్న పోలీసులు రేవ్ పార్టీపై దాడి చేశారు. ఈ సందర్భంగా రేవ్ పార్టీని ఏర్పాటు చేసిన నలుగురు నిర్వాహకులతో పాటు అక్కడ అసభ్యకర రీతిలో అర్ధ నగ్న నృత్యాలు చేస్తున్న 10 మంది యువతులను అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడ్డ యువతులంతా హైదరాబాదుకు చెందిన వారుగా పోలీసులు గుర్తించారు.

  • Loading...

More Telugu News