: నా కడుపులో అఫ్రిది బిడ్డ పెరుగుతున్నాడు!... మోడల్ అర్షి ఖాన్ సంచలన ప్రకటన
పాకిస్థాన్ క్రికెట్ జట్టు కెప్టెన్ షాహిద్ అఫ్రిదితో తాను సన్నిహితంగా గడిపానంటూ గతంలో ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరచిన ముంబై మోడల్, నటి అర్షి ఖాన్ మరో సంచలన ప్రకటన చేసింది. రెండు రోజుల క్రితం ‘దైనిక్ భాస్కర్’ పత్రికకు ఇచ్చిన వీడియో ఇంటర్వ్యూలో ఆమె చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయాయి. అఫ్రిది కారణంగా తాను గర్భవతిని అయ్యానని ప్రకటించిన అర్షి ఖాన్, తన కడుపులో అతని బిడ్డ పెరుగుతున్నాడంటూ సంచలన ప్రకటన చేసింది. అంతేకాక లవర్ గా అఫ్రిదికి వందకు వంద మార్కులేయవచ్చని కూడా పేర్కొంది.