: ‘గబ్బర్ సింగ్’కు, ‘సర్దార్ గబ్బర్ సింగ్’కు తేడా ఏమిటంటే..!: అనంత శ్రీరామ్
తాను రాసిన పాటలో ఒక లైన్ ద్వారా ‘గబ్బర్ సింగ్’కు ‘సర్దార్ గబ్బర్ సింగ్’కు తేడా ఏమిటో చెప్పేందుకు చిన్న క్లూ ఇస్తానని పాటల రచయిత అనంత శ్రీరామ్ అన్నారు. ‘సర్దార్ గబ్బర్ సింగ్’ ఆడియో వేడుకలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా అనంత శ్రీరామ్ మాట్లాడుతూ, ‘నా ఖాకీ చొక్కాని నీ రంగుల్లో చూపావే’ అనే పదాలు తాను రాసిన ఒక పాటలో ఉంటాయని అన్నారు. ఈ పదాల ద్వారా ‘గబ్బర్ సింగ్’కు, ‘సర్దార్ గబ్బర్ సింగ్’కు గల తేడా ఏమిటో తెలుసుకోవాలని ఆయన అన్నారు. ఈ సందర్భంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న అశేష, విశేష అభిమానులకు తన ధన్యవాదాలు తెలిపారు.